సమయం

రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్న కేసీఆర్

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
KCR: రాజ్‌ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని భావించగా.. చివరి నిమిషంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ కిన్నెర మొగిలయ్య ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు...
                 

TS: రేపు 1 నిమిషం పాటు ఎక్కడి వారక్కడే.. జాతీయ గీతాలాపనకు సర్వంసిద్ధం

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Mass Recitation of National Anthem in Telangana: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న తెలంగాణ రాష్ట్రం కీలక ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘సామూహిక జాతీయ గీతాలాపన’కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరుగనుంది. ఎక్కడి వారు అక్కడే ఆగి, నిల్చొని జాతీయ గీతం ఆలపించాలి. ఇందు కోసం ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్స్ వేయనున్నారు...
                 

నీలకంఠాపురానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. అన్న కొడుకు మంచి పనిపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి వీడియో

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Independence Day 2022: ఘనంగా బీటింగ్ రీట్రిట్ వేడుకలు

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో (Independence Day 2022) బీటింగ్ రీట్రిట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు చేతులు కలుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంతో మంది జనం తరలి వచ్చారు. దేశ భక్తి పాటలతో, మువ్వెల జెండాతో ఎంతో అట్టహాసంగా వేడుకలు జరిగాయి...
                 

దేవుడికి నైవేద్యంగా తేళ్లు.. కర్నూలు జిల్లాలో వింత ఆచారం

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

సియాచిన్‌ హిమపాతంలో గల్లంతైన ఆర్మీ జవాన్ మృతదేహం 38 ఏళ్ల తర్వాత లభ్యం

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
దేశ విభజన తర్వాత కశ్మీర్ సహా పలు ప్రాంతాలపై భారత్, పాక్‌ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 8 దశాబ్దాలు పూర్తికావస్తున్నా వీటికి మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. ఇటువంటి వాటిలో సియాచిన్ ఒకటి. 1949 నాటి కరాచీ ఒప్పందంలో సియాచెన్‌ హిమానీనదం ఎవరికి చెందుతుందో స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి ఇరు దేశాలూ ఈ ప్రాంతంలో సైన్యాలను మోహరించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి...
                 

విశాఖపట్నం, అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన.. జపాన్ టైర్ల కంపెనీ ప్రారంభం

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

అన్ని జంతువుల్లోకెల్లా నీచమైన, నికృష్టమైన జంతువు మనిషి.. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతోందిగా: కృష్టవంశీ

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో చెప్పాలి.. మంత్రి అమర్నాథ్ సెటైర్లు

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

August 15.. త్రివర్ణ కాంతులతో అంబానీ ఇల్లు.. విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్

8 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
August 15.. స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ ప్రజలందరూ ఏకమై.. తమ ఇళ్లపై జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కూడా స్వాతంత్య్ర వేడుకలకు తమ ఇంటిని సర్వాంగ సుందరంగా.. విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్‌మనిపించారు...
                 

Tricolor: జాతీయ జెండాను పూజించి.. హారతి ఇచ్చిన మహిళ

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
జెండా పండుగ (Tricolor) సందర్భంగా వాడవాడలా మువ్వెన్నల జెండా రెపరెపలాడుతుంది. స్వతంత్ర దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. అందులో భాగంగా ఓ మహిళ వీడియో నెటిజన్ల మనస్సును దోచుకుంటుంది. ఆ మహిళ జాతీయ జెండాకు పూజలు చేసి.. హారతి ఇచ్చింది. ఈ వీడియోను చూసిన యూజర్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఆమెకు ప్రణామాలు కూడా చేసేస్తున్నాను. మన జెండాకు ఆ అర్హత ఉందని అంటున్నారు...
                 

maharashtra డ్రైవర్ సీటులో బీజేపీ.. హోం, ఆర్థిక సహా కీలక శాఖలన్నీ ఆ పార్టీకే!

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
బీజేపీ-శివసేన రెబల్స్ సంకీర్ణ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ గతవారం జరగ్గా.. ఇరు పార్టీల నుంచి చెరో 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీఎం షిండే శాఖలను కేటాయించగా.. ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ బీజేపీకి దక్కాయి. దీంతో మరోసారి ఫడ్నవీస్ హావా కొనసాగినట్టయ్యింది. సీఎం పీఠంపై కూర్చోకపోయినా.. ప్రభుత్వం మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తుందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. వ్యూహాత్మకంగా సీఎం సీటును షిండేకు అప్పగించి.. ఆయనను నామమాత్రుడిగా మార్చేశారనే విమర్శలు వినబడుతున్నాయి...
                 

Ola First Electric Car: బిగ్ సర్‌ప్రైజ్ రివీల్ చేసిన ఓలా.. తొలి ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. ఖాది రంగులో.. !

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Ola First Electric Car: ఓలా తన బిగ్ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసేసింది. ఆగస్టు 15న మీ ముందుకు సరికొత్త ప్రొడక్టుతో రాబోతున్నామంటూ టీజర్లు, హింట్లు ఇచ్చుకుంటూ వచ్చిన ఓలా... నేడు తన తొలి ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ కారు గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను కూడా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో రివీల్ చేశారు. దీంతో పాటు సరికొత్త స్కూటర్ ఓలా ఎస్1ను, అలాగే ఖాది రంగులో ఎస్‌1 ప్రొ స్కూటర్‌ను విడుదల చేసింది కంపెనీ. ఈ ప్రొడక్టుల వివరాలు కింద ఆర్టికల్‌లో....
                 

Indigo flight: చుక్కలు చూపించిన చాటింగ్... ఆగిపోయిన ఫ్లైట్

11 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం (Indigo flight) ఓ చిన్న కారణంతో ఆగిపోయింది. ఆరు గంటల ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో చాటింగ్ చేయడమే దీనికి కారణం. ఆ చాటింగ్‌లో ఏదో అనుమానంగా ఒక మెసెజ్ రావడం.. దానిని తోటి ప్రయాణికురాలు చూడడంతో నానా రచ్చ జరిగింది. ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేయడంతో వారు ప్రయాణికులను దింపి.. తనిఖీలు నిర్వహించారు. దాంతో ఆరు గంటల లేట్‌గా ఫ్లైట్ స్టార్ట్ అయింది...
                 

KTR: భారతీయులకు ఇదో 'మైల్‌స్టోన్ డే'.. స్వాతంత్ర్య స్ఫూర్తితో కేటీఆర్ ట్వీట్

11 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న భారతీయులందరికీ ఇదో మరపురాని రోజని.. 'మైల్ స్టోన్ డే' అంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేకత, విశిష్టతను మనం గౌరవించుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. మన దృష్టంతా మనల్ని ఏకం చేసే అంశాలపైనే ఉండాలని.. మనల్ని విడదీసే వాటిపై ఉండకూడదని పేర్కొన్నారు...
                 

ఈ 40 స్టాక్స్‌కి 425 శాతం రిటర్నులు.. డబ్బులు పెట్టినోళ్లకి అమృత కాలం!

12 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Multibagger Stocks: గడిచిన 12 నెలలు ఎంతో కీలకం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఎఫ్‌ఐఐలు తరలి వెళ్లాయి. రూపాయి వాల్యూ ఎన్నడూ లేనంత దిగజారింది. క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. వడ్డీ రేట్లు పెరిగాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఇన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. ఈ 12 నెలల కాలంలో కొన్ని స్టాక్స్ అద్భుతమైన రిటర్నులను అందించాయి...
                 

Bandi Sanjay పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి.. జనగామలో ఉద్రిక్తత

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

యాదాద్రిలో భక్తుల రద్దీ.. వరుస సెలవులతో కిటకిటలాడిన ఆలయం

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రెండో శనివారం, ఆదివారం, ఆగస్టు 15 వరుసగా రావడంతో మూడురోజుల పాటు సెలవులు వచ్చాయి. దాంతో భక్తులు యాదాద్రి దర్శనానికి పోటెత్తారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని వరుస సెలవుల నేపథ్యంలోనే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని.. దాంతో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తూ సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని ఈఓ ఎన్.గీత తెలిపారు...
                 

Karunanidhi పంధ్రాగస్టు రోజున సీఎంల జెండా ఆవిష్కరణ వెనుక ఆయన పోరాటం.. కేంద్రం అంగీకారం

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
భారతావని 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారతీయులు.. 1947 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నారు. విదేశీ పాలన శృంఖలాలను భారత్‌ తెంచుకుని 75 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో వాడవాడలా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. ఈ రోజున ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం సమర్పిస్తున్నారు...
                 

జాతీయ జెండా ఎగరేసే క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కొడుక్కి నెలకు రూ.5 లక్షల జీతం.. అమ్మ వృద్ధాశ్రమంలో.. బండి సంజయ్ ఆవేదన

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
కొడుక్కి బెంగళూరులో ఉద్యోగం.. కోడలికి హైదరాబాద్‌లో జాబ్.. పిల్లలనేమో హాస్టల్లో చేర్పించారు. తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించారు... ఇదీ బండి సంజయ్ చెప్పిన ఓ కుటుంబ కథ. ఆ తల్లి పరిస్థితి చూసి చలించిపోయిన తాను కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడితే.. తనకు నెలకు రూ.5 లక్షల జీతమని... ఉద్యోగం వదులుకోలేక అమ్మను ఓల్డ్ ఏజ్ హోంలో చేర్పించానని చెప్పాడన్నారు. ఇలా చేయడం సరికాదని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు...
                 

Independence Day: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో తెలంగాణ.. అసెంబ్లీలో స్పీకర్ జెండా వందనం

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వేడుకగా నిర్వహిస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ఇరు సభల స్పీకర్లు జెండా వందనం చేశారు. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు...
                 

కారులో కానిచ్చేస్తుండగా దొరికిపోయా!.. చిలిపి పనులపై నోరువిప్పిన నాగ చైతన్య

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఆ కుటుంబంలో అందరూ ఒకేలా చనిపోయారు.. రీజన్ ఏంటంటే..!

17 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
కొన్ని కొన్ని వింటున్నప్పుడు నమ్మలేక పోయినా.. ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి తీరాల్సిందే. పెద్దవాళ్లు వాళ్లకేదో శాపమంటే.. చదువుకున్న వాళ్లు జన్యుపరంగా వచ్చింది అంటూ ఉంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. 50 ఏళ్ల వ్యక్తి రాత్రి చక్కగా భోజనం చేసి ఇంట్లో నిద్రపోయాడు.. కానీ అర్ధరాత్రి చూస్తే చలనం లేదు. అటవీ ప్రాంతం కావడంతో ఏదైనా విషపురుగు కరిచిందేమోనని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు గుండెపోటుతో మరణించాడని తేల్చారు. తీరా ఒకసారి వాళ్ల కుటుంబ చరిత్ర పరిశీలిస్తే అందరూ గుండెపోటుతోనే మరణించారంట..!..
                 

రూ.1 నుంచి రూ.3,207కి పెరిగిన షేరు.. లక్ష పెట్టుబడికి రూ.26.28 కోట్ల రిటర్నులు.. కోట్లు కుమ్మరించింది!

18 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Eicher Motors Share Price: స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఒకప్పుడు వీటి ధర కేవలం రూపాయి లేదా రూ. 2 మధ్యన లేదంటే రూ.10 కంటే తక్కువగానే ఉండి ఉంటాయి. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ స్టాక్స్ అందించిన రిటర్నులను చూస్తే మీరు మాత్రం షాకవ్వాల్సిందే. అలాంటి స్టాక్స్‌లో ఒకటే ఐషర్ మోటార్స్. ఈ కంపెనీ తన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కోట్లు కుమ్మరించింది. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా కోట్లాది రూపాయలను అందించింది. ప్రస్తుతం ఐషర్ మోటార్స్ షేరు ధర హిస్టరీని మనం ఒకసారి చూద్దాం....
                 

Asaduddin Owaisi: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఓవైసీ.. మజ్లిస్ నేత ఇంట్రెస్టింగ్ ట్వీట్

18 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఏపీలో 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష.. ఆ 20మందికి అదృష్టం.. కండిషన్స్ అప్లై!

19 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Ashfaqulla Khan: దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన అష్ఫాఖుల్లా ఖాన్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
భారత దేశం (Ashfaqulla Khan) కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిలో అష్ఫాఖుల్లా ఖాన్ కూడా ఒక్కరు. 27 ఏళ్లకే ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు. ఎందరో వీరుల్లో అగ్గి రగిల్చాడు. భగత్ సింగ్ కంటే ముందే ఉరికంబాన్ని ముద్దాడి.. ఇది తన అదృష్టం ప్రకటించాడు. బతికు ఉన్నంత కాలం పేద ప్రజల కోసం ఆలోచించాడు. దేశ విముక్తి కోసమే శ్రమించాడు. అష్పాక్ యోధుడే కాదు.. మంచి కవి.. మేధావి కూడా. అలాంటి వీరుడిని బ్రిటిష్ ప్రభుత్వం 1927, డిసెంబర్ 19న ఉరి తీసింది...
                 

Madhya Pradesh: పోటెత్తిన వరదలు.. వీధిలోకి వచ్చిన మొసలి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Karnataka: టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను ధ్వంసం చేసిన దుండగులు.. మళ్లీ రగడ

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
కర్ణాటకలో (Karnataka) మళ్లీ టిప్పు సుల్తాన్ రగడ చోటుచేసుకుంది. బెంగళూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను ఎవరో చించిపడేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ఎవరో విధ్వంసం సృష్టించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. అయితే గతంలో కూడా ఆ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్‌పై అనే వివాదాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది టిప్పు సుల్తాన్‌ను దేశ ద్రోహిగా అభివర్ణిస్తుంటారు...
                 

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడు: రేవంత్ రెడ్డి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

చంద్రబాబు ఆడియోను అమెరికాలో టెస్ట్ చేయించాలి.. ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Veera Gunnamma: రైతుల పక్షాన పోరాడుతూ.. బ్రిటిషర్లు తూటాలకు బలైన సిక్కోలు వీరనారి గున్నమ్మ

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
Veera Gunnamma: స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలుగు మహిళల్లో ఒకరు వీర గున్నమ్మ. రైతుల పక్షాన బ్రిటీషర్లతో, జమీందారుతో పోరాటం చేసిన ఆమె.. బ్రిటిషర్ల తూటాలకు బలయ్యారు. చిన్న వయసులోనే పెళ్లయ్యి.. భర్తను కోల్పోయినా సరే ఆమె రైతుల కోసం పోరాడారు. రైతుల్లో స్ఫూర్తి నింపి.. జమీందారుకు వ్యతిరేకంగా వారందర్నీ ఏకం చేసిన ఆమె.. చివరకు పోలీసుల తూటాలకు బలయ్యారు. పుట్టిన గడ్డ కోసం, రైతుల కోసం ఆమె ప్రాణత్యాగం చేశారు...
                 

Dalit Boy Thrashed: నీళ్లు తాగాడని చితకబాదిన టీచర్... తొమ్మిదేళ్ల విద్యార్థి మృతి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
రాజస్థాన్‌లో (Dalit Boy Thrashed) విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. హద్దులు దాటాడు. చిన్న కారణానికి ఓ పిల్లవాడిని చితకబాదాడు. దాంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనిపై విద్యాశాఖ కూడా కమిటీ వేసి విచారణ చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా విచారం వ్యక్తం చేసింది.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది...
                 

Kothagudem MLA: కొత్తగూడెం వదిలే ప్రసక్తే లేదు.. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తా

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Rajasthan: సల్మాన్ ఖాన్ చంపిన జింకకు స్మారకం... 800 కిలోల బరువుతో విగ్రహం

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
రాజస్థాన్‌లో (Rajasthan) 24 ఏళ్ల క్రితం ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ జింకలను వేటాడాడు. ఆ కేసు చాలాకాలం నడిచింది. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసులు కొట్టేసింది. అయితే ఆ కృష్ణ జింక వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఆ చనిపోయిన జింకకు బిష్ణోయ్ కమ్యూనిటీ భారీ స్మారకాన్నిఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనికోసం గ్రామస్థులు సహకరిస్తున్నారు. వారంతా డబ్బులు చందాలుగా వేసి జింక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు...
                 

NPS: ఎన్‌పీఎస్ ఖాతాదారులు యూపీఐ లావాదేవీలు చేసుకోవడమెలా..? ప్రాసెస్ తెలుసుకోండి..

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
NPS: రిటైర్‌మెంట్ తర్వాత మీరు ఎలాంటి టెన్షన్లు లేకుండా బతకాలంటే.. ఇప్పటి నుంచే పెన్షన్ సేవింగ్స్ పథకాలలో డబ్బులను డిపాజిట్ చేసుకోవడం ముఖ్యం. అలాంటి పథకాలలో ఒకటి ఎన్‌పీఎస్. ప్రభుత్వానికి చెందిన ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా భారీ రిటర్నులనే పొందవచ్చు. ఇది అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం కూడా. ఈ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేయడాన్ని ప్రస్తుతం ప్రభుత్వం సులభతరం చేసింది. యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని చెప్పింది. అయితే యూపీఐ ద్వారా డబ్బులు ఎలా డిపాజిట్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం....
                 

UP Gang: పగలు దుప్పట్లు అమ్ముతూ.. రాత్రి కన్నాలు వేస్తూ.. పెద్ద ప్లానే..!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
నార్త్ నుంచి వచ్చిన ముఠాలు మారు వేషాల్లో తిరుగుతూ మాటు వేసి చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో చెడ్డీ గ్యాంగ్ పేరుతో కొన్నాళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన అందరికీ గుర్తే. ఇప్పుడు అదే తరహాలో రూటు మార్చి దుప్పట్లు అమ్మేవాళ్లలా నమ్మిస్తూ.. రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంతర్ రాష్ట్ర ముఠా ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు...
                 

Rakesh Jhunjhunwala Death: స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝుంఝన్‌వాలా కన్నుమూత

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
Rakesh Jhunjhunwala: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝుంఝన్‌వాలా హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ఆయన రూ.11 వేల కోట్లకు అధిపతి అయ్యారు. స్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు పెట్టే తీరును గమనించిన విశ్లేషకులు ఆయన్ను వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఆయన కాలేజీ రోజుల నుంచే మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు...
                 

Akhila Priya కారుకు టోల్‌ వసూలు.. అక్కడికక్కడే ఫోన్‌లో పంచాయితీ.. వీడియో వైరల్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
అహోబిలంలో అఖిలప్రియ కారుకు టోల్‌గేట్ వసూలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరతో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ అక్కడిక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్‌గేట్ నిర్వాహకులపై ఇప్పటికే అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని మరోసారి ఇదే రిపీట్ అయితే కలెక్టర్‌కు కంప్లెయింట్ చేస్తానంటూ ఆమె హెచ్చరించారు...
                 

కన్న కొడుకును ఖతం చేసేందుకు సుపారీ.. ఆ పనులు చేస్తున్నందుకే..!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
బిడ్డకి చిన్న గాయమైనా తండ్రి మనస్సు తట్టుకోలేదు. ఎవరైనా కొట్టారంటేనే ఆవేశంతో రగిలిపోయేంత ప్రేమ తండ్రిది. మరి అలాంటి ఓ తండ్రి కన్నకొడుకునే చంపించాలని అనుకుంటాడా..? కానీ.. ఇక్కడో తండ్రి సుపారీ ఇచ్చి మరీ కొడుకును చంపించేశాడు. సొంత బావమరిదితో కలిసి పక్కా ప్లాన్‌తో కొడుకు మరణానికి కారణమయ్యాడు. అయితే, కొడుకును చంపేంతంగా తండ్రిలో కలిగిన కోపం ఏంటో తెలుసా..?..
                 

TSRTC సరికొత్త రికార్డు.. ఒక్కరోజులోనే అంత మంది ప్రయాణం..!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ఇప్పటి వరకు సాధ్యం కాని నంబర్స్ సొంతం అయ్యాయంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆగస్టు 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది ప్యాసింజర్స్ ప్రయాణించారని.. టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక నంబర్ అంటూ ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు...
                 

భారత్ ఆందోళనలు బేఖాతరు.. చైనా గూఢచార నౌక‌ను నిలిపేందుకు శ్రీలంక అనుమతి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

బ్యాంక్ దోపిడీకి వినూత్న స్కెచ్.. ఊహించని ప్రమాదం, 8 గంటలు శ్రమించి కాపాడిన పోలీసులు

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Tunnel For Bank Robbery: రోమ్ నగరంలోని వాటికన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ దోపీడీ చేయాలని భావించిన ఓ దొంగల ముఠా సొరంగం తవ్వేందుకు ప్లాన్ వేసింది. మూసి ఉన్న ఓ దుకాణంలో నుంచి బ్యాంక్‌లోకి 6 మీటర్ల దూరం సొరంగం తవ్వింది. రోజు కొంత సొరంగం తవ్వుతూ దగ్గరికి వరకూ వెళ్లారు. కానీ, విధి వక్రీకరించింది. సొరంగం పైభాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. అందులో చిక్కుకొని కాపాడండీ అని కేకలు వేశారు...
                 

భారతీయుడిగా నా జన్మ ధన్యమైంది.. దటీజ్ ధోనీ, చిన్న డీపీతో తనేంటో చెప్పాడు

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
MS Dhoni Instagram DP: కోట్లాది మంది భారతీయుల అభిమాన ఆటగాడు ఎంఎస్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని మార్చడం ద్వారా తనేంటో మరోసారి నిరూపించాడు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ తన డీపీని ట్రైకలర్‌గా మార్చేశాడు ధోనీ. దీంతో పాటు అతడు పెట్టిన చిన్న వాక్యం ఇప్పుడు అభిమానులతో ప్రసంశలు కురిపిస్తోంది. అంతేకాదు.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 3 ఫార్మాట్లలో భారత్‌కు ప్రపంచ కప్ అందించిన ఏకైక సారధిగా ధోని చరిత్రలో నిలిచాడు...
                 

Pritilata Waddedar: 21 ఏళ్లకే అమరత్వం.. చివరి మిషన్‌లో వేషం మార్చి.. బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించిన యోధురాలు

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
చావు ఎప్పుడైనా వస్తుంది.. కానీ దానికో అర్థం ఉండాలి.. అది కూడా చైతన్యం కలిగించే అంశం అయి ఉండాలనుకునే వీరులు అతి తక్కువ మంది ఉంటారు. మన భారత స్వతంత్ర సంగ్రామంలో అలాంటి వీరులు ఎందరో నేలకొరిగారు. అతి చిన్న వయస్సులోనే.. తమ యవ్వనాన్ని.. ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం అర్పించి అమరులయ్యారు. మన దేశ చరిత్రలో తమకంటూ ఓ పేజీని రచించుకున్నారు. మన భారత దేశం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవంలో వారి పాత్ర చెప్పలేనిది.. అలాంటి వారిలో ప్రీతిలతా వడ్డేదార్ (Pritilata Waddedar) ఒకరు...
                 

Bihar Gang ఎమ్మెల్యేలకు బెదిరింపులు.. హవాలా ద్వారా పాక్‌కు కోట్లాది రూపాయలు పంపిన బిహార్ గ్యాంగ్

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
పంజాబ్, ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వ్యవహరంలో హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హరియాణా సర్కారు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది. పాక్ ఐపీ అడ్రస్‌తో మెయిల్స్, కాల్స్ రావడంతోనే ఆందోళన వ్యక్తమయ్యింది. కానీ, దీని వెనుక ఉగ్రవాదుల హస్తం లాంటిది ఏదీ లేదని తేలింది. కేవలం డబ్బుల కోసమే ఇలా చేసినట్టు పోలీసులు తాజాగా వెల్లడించారు...
                 

కానిస్టేబుల్ తో సెల్ఫీ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ.. కారణం తెలిస్తే మీరు కూడా ప్రశంసిస్తారు..!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Tiranga Yatra: దూసుకొచ్చిన ఆవు... గాయపడిన మాజీ డిప్యూటీ సీఎం

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
గుజరాత్‌లోని (Tiranga Yatra) బీజేపీ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీపైకి ఓ ఆవు దూసుకెళ్లింది. దాంతో చాలామందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌ కాలికి గాయమైంది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు 20 రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు. ఆ దాడిలో మరికొందరు కూడా గాయపడినట్టు వెల్లడించారు...
                 

Karnataka: పసివాడిని కాటేయబోయిన కాల నాగు... తల్లి ఏం చేసిందో తెలిస్తే హడల్

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
కర్ణాటకలోని (Karnataka) మాండ్యాలో ఓ తల్లి తన కన్నకొడుకును కాపాడుకుంది. కాటేయబోతున్న కాలనాగు నుంచి తన కుమారుడిని ఎంతో చాకచక్యంగా రక్షించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ అమ్మ తెగింపును చూసి నెటిజన్లు మాత్రం తెగ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఎంతైనా అమ్మ కదా అని కామెంట్లు పెడుతున్నారు. అలా ఆ తల్లి ఇంటర్‌నెట్‌లో పాపులర్ అయిపోయింది. ఆమె సమయస్ఫూర్తికి, చాక చక్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు...
                 

Tricor: గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా రామచంద్రనాయక్

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Kashmir ప్రభుత్వ ఉద్యోగులుగా ఉగ్రవాదుల కుటుంబసభ్యులు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతూనే ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తేలడంతో నలుగుర్ని డిస్మిస్ చేశారు జమ్మూ కశ్మీర్ యంత్రాంగం. ఈ నలుగురూ లోయలోని ఉగ్రవాదులకు సాయం చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, కొందరు అధికారుల సహకారంతో అక్రమంగా ఉద్యోగాలు పొందినట్టు దర్యాప్తులో తేలడం విస్మయానికి గురిచేస్తోంది. వీరిలో హిజ్బుల్, జేకేఎల్ఎఫ్ వంటి ఉగ్రవాదుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో కలిసి ఈ ఉద్యోగులు పనిచేసినట్టు వెల్లడయ్యింది...
                 

Woman Ad Revenge: మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్... ఓ యాడ్‌తో ప్రతీకారం తీర్చుకున్న అమ్మాయి..!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
ఆస్ట్రేలియాలో (Woman Ad Revenge) తనకు హ్యాండ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్‌పై ఓ అమ్మాయి కసి తీర్చుకుంది. అతని మోసాన్ని అందరికి తెలిసేలా చేసింది. దాని కోసం ఓ పేపర్లో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది. దాంతో ఆ విషయం నగరంలో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వారి గురించి తెలుసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారి గురించి తమకు తెలియదని ఆ వార్తా పత్రిక యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది...
                 

ఒంటిమీద పెట్రోల్ పోసుకున్నవారికి అగ్గిపెట్టే దొరకలేదా..?: షర్మిల

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఆన్‌లైన్‌లోనే జాతీయ జెండా కొనొచ్చు.. రేటు ఎంత? ప్రాసెస్ ఎలానో తెలుసుకోండి!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
National Flag: మీరు జాతీయ జెండా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు నేరుగా పోస్టాఫీస్‌కు వెళ్లి కూడా జెండాను కొనుగోలు చేయొచ్చు. పోస్టాఫీస్‌లో ఆగస్ట్ 14 వరకు ప్రతి రోజూ తెరిచే ఉంటాయి. హాలిడేస్ అంటూ ఏమీ ఉండవు. అందువల్ల మీరు వెళ్లి జెండా కొనొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా జాతీయ జెండా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ద్వారా జెండా కొనొచ్చు...
                 

మెల్‌బోర్న్‌లో తమన్నా సింప్లిసిటీ.. మిల్క్ బ్యూటీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

‘కార్తికేయ 2’ రివ్యూ.. ఎంగేజింగ్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

విజయమ్మతో మాట్లాడటానికి ప్రయత్నించా.. అలా జరిగే ఛాన్స్ లేదు, విచారణ జరిపించాలి: రఘురామ

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Munugode Bypoll: కంచర్ల బ్రదర్స్‌కి ప్రగతి భవన్ నుంచి పిలుపు.. మునుగోడు టికెట్ ఆయనకేనా?

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయం కాగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ నుంచి కంచర్ల సోదరులకు పిలుపు అందింది. దీంతో నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడైన కంచర్ల కృష్ణారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కొచ్చనే ప్రచారం ఊపందుకుంది...
                 

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. రెండు రోజుల్లో బిగ్‌ అప్‌డేట్

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Borish Johnson నా మెసేజ్, ఫోన్‌ కాల్స్‌‌కు బోరిస్ జాన్సన్ రిప్లై ఇవ్వడం లేదు: రిషి సునాక్‌

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో రిషి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రధాని పీఠం నుంచి తప్పుకోడానికే ముందు సునాక్ రాజీనామా చేశారు. తాజాగా, మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదంటూ రిషి ఓ చర్చా వేదికలో సంచలన వ్యాఖ్యలు చేశారు...
                 

30 ఏళ్ల మహిళతో 19 ఏళ్ల యువకుడి ప్రేమ.. హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన తండ్రి

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

సినిమా రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. అప్పు చేసి మరీ భర్త హత్యకు సుపారీ

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన భర్త హత్యకు అప్పు చేసి మరీ సుపారీ ఇచ్చింది ఓ ఇల్లాలు. ఒకసారి మిస్సవడంతో ఈసారి తుపాకీతో మర్డర్ ప్లాన్ చేసింది ఓ ప్రేమజంట. సినిమా రేంజ్‌లో చేసిన ప్లాన్ చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. మొత్తం ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది...
                 

హెల్మెట్ లేకపోతే బైక్, స్కూటర్‌కు పెట్రోల్ కొట్టించుకోలేం.. కొత్త రూల్స్!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Today Petrol Rate: పెట్రోల్ బంకుకు వెళ్తున్నారా? అయితే కచ్చితగా హెల్మెట్ పెట్టుకోండి. లేదంటే మీకు పెట్రోల్ లభించదు. కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ఈ రూల్ వర్తిస్తుంది. అందువల్ల మీరు పెట్రోల్ బంకుకు వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు...
                 

బంగారం, వెండి ధరలు జిగేల్.. పరుగో పరుగు!

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Gold Price Today: బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర నేడు మాత్రం పైపైకి చేరింది. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. అంటే బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి జోరు మీద ఉంది. వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. దీంతో మన మార్కెట్‌లో కూడా బంగారం వెండి ధరలు పైపైకి చేరాయి...
                 

ఏపీలో 'ఆజాదీకా అమృత్ మమోత్సవ్‌' వేడుకలు.. కోటి జెండాలు పంపిణీ చేసిన జగన్ సర్కార్

2 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

సురేఖావాణికి బాయ్ ఫ్రెండ్.. మంచి హైట్, ఫిజిక్, డబ్బు, గెడ్డం అన్నీ ఉన్నోడే.. సీక్రెట్ చెప్పేసిన కూతురు సుప్రిత

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Surekha Vani Boyfriend: భర్త చనిపోయిన తరువాత సీనియర్ నటి సురేఖావాణి సింగిల్‌గానే ఉంది. అయితే ఆమె పెళ్లికి సంబంధించి అనేక రూమార్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే వీటిపై పలు సందర్భాల్లో స్పందించిన సురేఖావాణి తనకి పెళ్లిపై ఇప్పట్లో ఆలోచనలేదని చెప్పకనే చెప్పేసింది. అయితే ఆమె కూతురు సుప్రిత మాత్రం తన తల్లి బాయ్ ఫ్రెండ్ గురించి సీక్రెట్స్ బయటపెట్టేసింది. తాజాగా ఇంటర్వ్యూలో తమకి సంబంధించిన పర్సనల్ విషయాలను రివీల్ చేశారు ఈ తల్లీ కూతుళ్లు...
                 

Shirdi Saibaba Temple: షిరిడీ సాయికి రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటం

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
ఆంధ్రప్రదేశ్‌కు (Shirdi Saibaba Temple) చెందిన వ్యక్తి షిరిడీ సాయిబాబాకు బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేశారు. రూ.36.98 లక్షల విలువజేసే కిరిటాన్ని, వెండి పళ్లాన్ని కూడా అందజేశారు. ఏపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్‌ 770 గ్రాముల బంగారు కిరీటం, 620 గ్రాముల వెండి కంచాన్ని గురువారం సాయిబాబాకు అందజేసినట్టు ఆయన నిర్వాహకులు చెప్పారు...
                 

మారుతీ కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ కారు.. మైలేజ్ అదుర్స్!

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
Swift CNG Car: పెట్రోల్, డీజిల్ ధరలు మారడంతో కంపెనీలు సీఎన్‌జీ వెహికిల్స్ లాంచింగ్ వైపుకి మరలుతున్నాయి. వాహనదారులు ఎక్కువగా సీఎన్‌జీ వెహికిల్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో.. కంపెనీలు CNGలో సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకి తన ఫేమస్ స్విఫ్ట్ వెహికిల్‌ను సీఎన్‌జీలో తీసుకొచ్చింది. స్విఫ్ట్ ఎస్ సీఎన్‌జీ పేరుతో ఈ కారును భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎలా ఉంది.. ? మైలేజ్ ఎంత ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం....
                 

Balamritham: తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీలు..!

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మునుగోడు టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. ఆందోల్ లో రహస్య భేటీ..!

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Khammam: 100 ఎకరాల్లో రిసెప్షన్... 3లక్షల మందికి భోజనాలు, హాట్‌టాపిక్‌గా మాజీ ఎంపీ కూతురి పెళ్లి

3 days ago  
న్యూస్ / సమయం/ Telugu Home